ఓ ఇల్లాలు చేసిన పొరపాటు కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొయిన్ పురిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగ్లా కన్హై గ్రామంలో శివానందన్ (35), అతని కుమారులు శివంగ్ (6), దివ్యాంష్ (5), అతని బావ రవీంద్ర సింగ్ (55), పొరుగింటి వ్యక్తి సోబ్రాన్ (45) టీ తాగిన తరువాత తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. వీరందరూ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వీరిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే..అప్పటికే రవీంద్ర సింగ్, శివాంగ్, దివ్యాన్ష్ చనిపోయారని వైద్యులు తెలిపారు. సోబ్రాన్, శివానందన్‌ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం సైఫాయి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందతూ వీరు మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. విచారణ చేపట్టారు. శివానందన్ భార్య పొరపాటున టీ పొడికి బదులు వరి పంటకు వాడే పిచికారీ మందును కలిపినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్పీ కమలేశ్ దీక్షిత్ తెలిపారు.