చైనాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో 18 మంది మృతిచెందారు. ఈ ఘటన సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో జరిగింది. ప్రావిన్స్‌లోని జెచెంగ్ కౌంటీలో శుక్రవారం తెల్లవారుజామున ఓ మార్షల్ ఆర్ట్స్ కేంద్రంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు.
ఈ అగ్నిప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుతస్తోంది. కాగా.. అగ్నిప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు.
జెచెంగ్ కౌంటీలోని మార్షల్ ఆర్ట్స్ సెంటర్‌లో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో మొత్తం 18 మంది మృతి చెందగా, 16 మంది గాయపడ్డారని ప్రభుత్వ సిజిటిఎన్-టివి నివేదించింది.
ఇదిలా ఉంటే.. ఈ నెల 13న సెంట్రల్ హుబెయి ప్రావిన్స్‌లో గ్యాస్ పైప్‌లైన్ పేలుడు సంభవించడం 25 మంది మరణించగా..138 మంది వరకు గాయపడ్డ విషయం తెలిసిందే. భద్రతా నిర్వహణలో లోపాలు బయటపడడంతో కంపెనీకి చెందిన ఎనిమిది మంది ఉద్యోగులను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు.