ఢిల్లీలో భారీ అగ్నిప్ర‌మాదం.. ఆరుగురు గ‌ల్లంతు

Fire Breaks out at Shoe Factory in Udyog Nagar.దేశ రాజ‌ధాని ఢిల్లీలో మ‌రో భారీ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jun 2021 12:28 PM IST
ఢిల్లీలో భారీ అగ్నిప్ర‌మాదం.. ఆరుగురు గ‌ల్లంతు

దేశ రాజ‌ధాని ఢిల్లీలో మ‌రో భారీ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. సోమ‌వారం ఉద‌యం ప‌శ్చిమ ఢిల్లీ ప్రాంతంలోని ఉద్యోగ్ న‌గర్‌లో ఉన్న ఓ షూ(బూట్ల‌) త‌యారీ ప‌రిశ్ర‌మ‌లో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. మంట‌లు ఉవ్వెత్తున ఎసిగిప‌డ్డాయి. స్థానికులు వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే అగ్నిమాపక సిబ్బంది 31 పైరింజ‌న్ల‌తో అక్క‌డి చేరుకుని మంట‌ల‌ను ఆర్పేందుకు య‌త్నిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో ఆరుగురు గల్లంతు అయ్యారని తెలుస్తోంది. షూ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఆరుగురు కనిపించడం లేదని, వారి గురించి గాలిస్తున్నామని అగ్నిమాపక శాఖ డైరెక్టరు అతుల్ గార్గ్ చెప్పారు.

అయితే.. ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటి వరకూ సమాచారం లేదని అధికారులు తెలిపారు. కానీ..ఆస్తినష్టం భారీగా జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేదు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా ..కొన్ని రోజుల క్రితం లజపత్ నగర్ మార్కెట్ లోని ఓ బట్టల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగి కోట్లాది రూపాయల ఆస్తినష్టం సంభవించిన విషయం తెలిసిందే.

Next Story