ఎలక్ట్రానిక్‌ వస్తువుల గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం

Fire breaks out at manufacturing unit in Alwar. భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ కంపెనీ గోడౌన్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

By -  అంజి
Published on : 21 Dec 2021 8:07 AM IST

ఎలక్ట్రానిక్‌ వస్తువుల గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం

రాజస్థాన్‌ రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ కంపెనీ గోడౌన్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటన అల్వార్‌ జిల్లా నీమ్రానా ప్రాంతంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు 12 ఫైరింజన్లతో ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదాన్ని చూస్తుంటే భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే అగ్ని ప్రమాదం ఎందుకు జరిగిందన్న దాని కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story