దారుణం.. మరో కొవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. 18 మంది రోగుల సజీవ దహనం
Fire breaks out at covid hospital in gujrat.ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తోండగా.. మరోవైపు అగ్నిప్రమాదాలు
By తోట వంశీ కుమార్ Published on 1 May 2021 1:55 AM GMTఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తోండగా.. మరోవైపు అగ్నిప్రమాదాలు భయపెడుతున్నాయి. గత కొద్ది రోజులుగా వరుస అగ్నిప్రమాదాలతో కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. గుజరాత్ రాష్ట్రంలో దారుణం జరిగింది. భరూచ్ నగరంలోని వెల్పేర్ ఆస్పత్రిలో అర్థరాత్రి దాటిన తరువాత సుమారు ఒంటి గంట ప్రాంతంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. చుట్టు దట్టమైన పొగ అలుముకుంది. అర్థరాత్రి కావడం.. రోగులు గాఢ నిద్రలో ఉండడం.. పొగ అలుముకోవడం రోగులకు అసలు ఏం జరిగిందనే విషయం తెలిసుకునే సరికి చాలా ఆలస్యం అయ్యింది.
ఈ ప్రమాదంలో 18 మంది రోగులు సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 50 మంది రోగులు ఉన్నారు. వారిలో 24 మంది ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం నుంచి బయటపడిన రోగులకు వెంటనే సమీపంలోని మరో ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Gujarat| Fire breaks out at a COVID-19 care centre in Bharuch. Affected patients are being shifted to nearby hospitals. Details awaited. pic.twitter.com/pq88J0eRXY
— ANI (@ANI) April 30, 2021
ఈ ఘటనపై భారుచ్ జిల్లా ఎస్పీ రాజేంద్ర సింహ్ చూదాసమా మాట్లాడుతూ.. అగ్నిప్రమాదానికి ఇంకా కారణం తెలియరాలేదని.. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారని... మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు. భారుచ్ -జంబూసర్ జాతీయ రహదారిపై ఉన్న నాలుగు అంతస్తుల ఆసుపత్రిని ఓ ట్రస్టు నిర్వహిస్తోంది. గ్రౌండు ఫ్లోరులో తెల్లవారుజామున మంటలు అంటుకున్నాయని అగ్నిమాపక శాఖ అధికారి శైలేష్ సనాసియా చెప్పారు.అగ్నిప్రమాదం జరిగిన వెంటనే గంటలోపల మంటలను అదుపు చేశామని.. రోగులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించామని అగ్నిమాపకశాఖ అధికారులు చెప్పారు.