ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం
Fire breaks out at AIIMS hospital in Delhi.దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
By తోట వంశీ కుమార్ Published on 17 Jun 2021 7:35 AM ISTఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. తొమ్మిదో అంతస్తులోని కన్వర్జెన్స్ బ్లాక్‌లో మంటలు చెలరేగాయి. మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడ్డాయి. అప్రమత్తం అయిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే మొత్తం 22 పైర్ ఇంజిన్లతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. మంటలను అదుపులోకి తెచ్చాయి. బుధవారం రాత్రి 10.32 నిమిషాల సమయంలో ఆస్పత్రిలోని తొమ్మిదో అంతస్తులో మంటలు చెలరేగినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన తొమ్మిదో అంతస్తులో పలు లాబోరేటరీలు, అధునాతన పరీక్షాకేంద్రాలు ఉన్నాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
#WATCH | A fire breaks out at the ninth floor of the All India Institute of Medical Sciences (AIIMS) hospital in Delhi. More details awaited. pic.twitter.com/uOas2zxKM5
— ANI (@ANI) June 16, 2021
కొవిడ్-19 నమూనాలను సేకరించిన ప్రాంతంలో మంటలు చెలరేగాయని డెప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ సునీల్ చౌదరి తెలిపారు. రాత్రి రూ.10.30 గంటల సమయంలో తమకు అత్యవసర సమాచారం వచ్చిందని చెప్పింది. వెంటనే 22 ఫైర్ టెండర్లను తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.