ఏపీలోని విశాఖ‌ప‌ట్నంలో ఉన్న ఫార్మాసిటీలో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ప‌ర‌వాడ ఫార్మాసిటీలోని జేపీఆర్ ల్యాబ్స్‌లో మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి మూడు సార్లు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. దీంతో భారీ ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. ఆ ప్రాంత‌మంతా ద‌ట్ట‌మైన పొగ‌లు అలుముకున్నాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బందికి వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు.

అగ్నిప్రమాదంలో మూడు సాల్వెంట్స్‌ డ్రమ్ములు దగ్ధమయ్యాయి. మొత్తం మూడుసార్లు పేలుళ్లు సంభవించాయని, పేలుడుకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో కంపెనీలో 20 మంది కార్మికులు ఉన్నారని వెల్లడించారు. అయితే.. కార్మికులంతా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం


తోట‌ వంశీ కుమార్‌

Next Story