రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి మండలం పుప్పాలగూడలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 2 అంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగి దట్టమైన పొగ వ్యాపించడంతో ఊపిరాడక ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మొదట బిల్డింగ్‌లో మంటలు చెలరేగిన సమాచారమందుకున్న లంగర్ హౌస్ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మొదటి ఫ్లోర్‌లోని ఓ గదిలో చిక్కుకున్న ఇద్దరు మహిళలు, ఓ చిన్నారిని స్ట్రెచర్‌పై బయటకు తీసుకొచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్నవారిని హాస్పిటల్‌కు తరలించారు. అయితే, వారి ఆరోగ్య పరిస్థితి విషమించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతులను సిజిరా(7), సహానా(40), జమీలా(70)గా గుర్తించారు. అయితే, ఘటన ఎలా జరిగింది? మంటలు ఎందుకు వ్యాపించాయనే విషయాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదం నుంచి మరో 5 మందిని కాపాడారు.