రంగారెడ్డి: ఆయిల్‌ మిల్‌లో భారీ అగ్ని ప్రమాదం

Fire accident in Oil Mill I రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మహేశ్వరం గేట్‌ ఆయిల్‌

By సుభాష్  Published on  12 Nov 2020 1:52 PM GMT
రంగారెడ్డి: ఆయిల్‌ మిల్‌లో భారీ అగ్ని ప్రమాదం

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మహేశ్వరం గేట్‌ ఆయిల్‌ మిల్‌ దగ్గర ఒక్కసారి మంటలు చెలరేగాయి. ఈ ఆయిల్‌ కంపెనీ చాలా రోజులుగా మూతపడి ఉంది. ఆయిల్‌ కంపెనీ చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

కాగా, కొన్ని రోజులుగా మూతపడివున్న కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కంపెనీ మూతపడి ఉండటంతో ప్రమాదం ఎలా సంభవించిందనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

మంటలు భారీగా చెలరేగడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాంతం పారిశ్రామిక వాడ కావడంతో పక్కనే మరో ఆయిల్‌ కంపెనీ ఉండటంతో మంటలు చెలరేగే అవకాశం ఉండటంతో పరిసర ప్రాంతాలకు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలిస్తున్నారు. ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. షాట్‌సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Next Story
Share it