యాదాద్రి.. కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

Fire Accident In Chemical Factory. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

By Medi Samrat
Published on : 26 Oct 2022 5:49 PM IST

యాదాద్రి.. కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని బీబీనగర్ మండల పరిధిలోని చందక్ లేబొరేటరీస్‌లో బుధవారం మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై బీబీనగర్ పోలీసులు మాట్లాడుతూ.. ''చందక్ ల్యాబొరేటరీస్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే రెండు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు''అని చెప్పారు.

బీబీనగర్ ఇన్‌స్పెక్టర్ కె సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. చందక్ ల్యాబొరేటరీస్‌లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే 2 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అన్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story