పెట్రోల్ బంక్‌కు వ‌చ్చిన లారీలో ఒక్క‌సారిగా మంట‌లు.. సిబ్బంది అప్రమత్తమవ‌డంతో..

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ పెట్రోల్ బంకులో పెను ప్ర‌మాదం త‌ప్పింది. పెట్రోల్ బంకుకు వచ్చిన ఓ లారీలో నుండి ఒక్క సారిగా మంటలు చెలరేగాయి.

By Medi Samrat  Published on  19 May 2024 1:19 PM GMT
పెట్రోల్ బంక్‌కు వ‌చ్చిన లారీలో ఒక్క‌సారిగా మంట‌లు.. సిబ్బంది అప్రమత్తమవ‌డంతో..

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ పెట్రోల్ బంకులో పెను ప్ర‌మాదం త‌ప్పింది. పెట్రోల్ బంకుకు వచ్చిన ఓ లారీలో నుండి ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. పెట్రోల్ బంక్ సిబ్బంది వెంటనే అప్రమత్తం అవడంతో పెను ప్రమాదం తప్పింది. భువనగిరి నుండి నల్గొండ వెళ్లే రహదారిపై ఉన్న నైహరా పెట్రోల్ బంక్ లో డ్రైవర్ డీజిల్ పోసుకోవడానికి వ‌చ్చాడు. ఆ స‌మ‌యంలో లారీ డీజిల్ ట్యాంక్ పగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతూ ఉండడంతో.. పెట్రోల్ బంక్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు.

ఒక్క‌సారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతూ దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్ట‌గా.. పెట్రోల్ బంక్ సిబ్బంది శ్రమించి మంటలను ఆర్పి వేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరా లో రికార్డు అయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా పెట్రోల్ బంకుకు వచ్చిన లారీలో నుండి మంటలు చెలరేగ డంతో ఆ మంటలు ఎక్కడ పెట్రోల్ బంకుకి అంటుకుంటాయోనని స్థానికులు,పెట్రోల్ బంక్ సిబ్బంది తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. కానీ పెట్రోల్ బంక్ సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Next Story