హైదరాబాద్: బాచుపల్లిలోని VNR విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో తోటి విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపుతోంది. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థినిపై అదే కళాశాలకు చెందిన ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాధితురాలు అందించిన ఫిర్యాదు ప్రకారం, ఆసీస్ అనే విద్యార్థి గత ఏడాది కాలంగా తనతో చనువుగా ఉంటూ వేధింపులకు గురిచేస్తున్నాడని పేర్కొంది.
ఇదే వ్యవహారంలో ప్రవీణ్ అనే మరో వ్యక్తి కూడా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె పోలీసులకు వివరించింది. అంతేకాకుండా, ఆ ఫోటోల విషయంలో నిందితుడి స్నేహితుడు కూడా బాధితురాలిని వేధింపులకు గురిచేశాడు. ఈ ఘటనపై బాధితురాలి తల్లి బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.