కోతుల భ‌యం ప్రాణం తీసింది

Fear of monkey young lady jumped from terrace.కోతులు దాడి చేస్తాయ‌న్న భ‌యంతో ప‌రుగులు తీసిన ఓ విద్యార్థిని ప్ర‌మాద‌వ‌శాత్తు భ‌వ‌నం పై నుంచి కింద ప‌డి ప్రాణాలు కోల్పోయింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 March 2021 12:00 PM GMT
Fear of monkey young lady jumped from terrace

కోతులు దాడి చేస్తాయ‌న్న భ‌యంతో ప‌రుగులు తీసిన ఓ విద్యార్థిని ప్ర‌మాద‌వ‌శాత్తు భ‌వ‌నం పై నుంచి కింద ప‌డి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘ‌ట‌న వ‌రంగ‌ల్ అర్భ‌న్ న‌గ‌రం మిల్స్‌కాల‌నీ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో బుధ‌వారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా రేగొండ మండ‌లం క‌న‌ప‌ర్తి నాగుర్ల‌ప‌ల్లి గ్రామానికి చెందిన గంజి శిరీష‌(24) ఎంసీఏ చ‌దివింది. ప్ర‌స్తుతం ఉద్యోగ‌వేట‌లో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన కేంద్రంలో శిక్ష‌ణ పొందుతోంది.

సాయంత్రం భ‌వ‌నంపై తోటి విద్యార్థినుల‌తో క‌లిసి ష‌టిల్ ఆడుతుండ‌గా కోతులు వ‌చ్చాయి. అవి త‌మ‌పై దాడి చేస్తాయ‌న్న భ‌యంతో వారంతా భ‌వ‌నంపై నుంచి కింద‌కు ప‌రుగులు తీశారు. భయంతో శిరీష అనే విద్యార్థిని కోతుల దాడి నుంచి తప్పించుకోడానికి.. హాస్ట‌ల్ భ‌వ‌నం పిట్ట‌గోడ ప‌క్క‌న మ‌రో భ‌వ‌నం ఉంద‌నుకొని కింద‌కు దూకింది. దీంతో కిందప‌డిపోయి తీవ్ర‌గాయాల‌తో ప్రాణాలు కోల్పోయింది.


Next Story
Share it