ఛార్జింగ్‌ కేబుల్‌తో.. 7 ఏళ్ల కూతురిని గొంతు కోసి చంపిన తండ్రి.. ఆ తర్వాత

Father strangles girl with charger, hangs himself due to financial distress. బెంగుళూరులో ఓ వ్యక్తి తన 7 ఏళ్ల కూతురిని మొబైల్ ఛార్జింగ్ కేబుల్‌తో గొంతుకోసి చంపిన ఘటన సంచలనం సృష్టించింది.

By అంజి  Published on  25 Feb 2022 5:16 PM IST
ఛార్జింగ్‌ కేబుల్‌తో.. 7 ఏళ్ల కూతురిని గొంతు కోసి చంపిన తండ్రి.. ఆ తర్వాత

బెంగుళూరులో ఓ వ్యక్తి తన 7 ఏళ్ల కూతురిని మొబైల్ ఛార్జింగ్ కేబుల్‌తో గొంతుకోసి చంపిన ఘటన సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 39 ఏళ్ల తండ్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బెంగళూరులోని అనేకల్ సమీపంలోని బొమ్మసంద్ర ప్రాంతంలో బుధవారం చోటుచేసుకుంది. మృతురాలిని సమీక్షగా గుర్తించారు. ఆ తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని 39 ఏళ్ల విజయ కుమార్‌గా గుర్తించారు. నిందితుడు వెల్డర్‌గా పనిచేసేవాడు.

హెబ్బగోడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్య ఉద్యోగానికి వెళ్లిన తర్వాత ఓ వ్యక్తి తన కుమార్తెను గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం బాలికను దిండుతో పొట్టన పెట్టుకున్నాడు. తన కుమార్తెను హత్య చేసిన తర్వాత, వెల్డర్ పైకప్పుకు ఉరివేసుకున్నాడు. ఆ వ్యక్తి ప్రైవేట్ వ్యక్తుల నుంచి అప్పులు తీసుకుని తిరిగి చెల్లించడంలో విఫలమైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆర్థిక సమస్యల కారణంగా ఒత్తిడికి గురయ్యాడు.

ఇదిలా ఉంటే.. మధ్యప్రదేశ్‌లోని గుణకు చెందిన ఓ వికలాంగుడు తన కుమార్తెను హత్య చేసి శవంపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన మంగళవారం గుణ జిల్లాలోని బజరంగ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైతా డోంగర్ గ్రామంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం 40 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేరం తర్వాత, నిందితుడు తండ్రి తన 14 ఏళ్ల కుమార్తె కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేశాడు. అనంతరం ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని పోలీసు సూపరింటెండెంట్ రాజీవ్ కుమార్ మిశ్రా తెలిపారు.

Next Story