5 ఏళ్ల బాలుడిపై తండ్రి, కొడుకు లైంగిక దాడి.. ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో..

కర్ణాటకలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఐదేళ్ల బాలుడిపై ఓ వ్యక్తి, అతని కుమారుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

By అంజి  Published on  18 Aug 2023 1:45 PM IST
Karnataka, Crime news, Bengaluru

5 ఏళ్ల బాలుడిపై తండ్రి, కొడుకు లైంగిక దాడి.. ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో..

కర్ణాటకలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఐదేళ్ల బాలుడిపై ఓ వ్యక్తి, అతని కుమారుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. నిందితులను పోలీసులు శుక్రవారం నాడు అరెస్టు చేశారు. ఇద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాష్ట్ర రాజధాని బెంగళూరులోని కామాక్షిపాల్య పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ కేసుకు సంబంధించి 55 ఏళ్ల నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అతని మైనర్ కొడుకును అబ్జర్వేషన్ హోమ్‌కు పంపారు. బాధిత బాలుడు నిందితుడికి బంధువు అని పోలీసులు తెలిపారు. నిందితుడు చిన్నారిపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితుడి తల్లి, బంధువు, చిన్నారిని నిందితుడి నివాసంలో వదిలి పనికి వెళ్లేవారు.

నిందితులు తమ లైంగిక వేధింపుల చర్యను ఆటగా భావించి చిన్నారిని నమ్మించారు. చిన్నారికి ఇన్‌ఫెక్షన్ సోకడంతో నేరం వెలుగులోకి వచ్చింది. రోజులు గడిచిన తర్వాత పిల్లవాడికి అలర్జీ వచ్చింది. క్లినిక్‌కి తీసుకెళ్లిన తర్వాత కూడా డాక్టర్ కారణం కనుగొనలేకపోయారు. అనంతరం బంధువుల ఇంటికి వెళ్లగా.. చిన్నారి వింతగా ప్రవర్తించాడు. అక్కడ చిన్నారిని విచారించగా, తండ్రీకొడుకులు తనపై అసభ్యంగా ప్రవర్తించారని చెప్పారు. బాధితుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా లైంగిక వేధింపులకు గురైనట్లు నిర్ధారణ అయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Next Story