స్నేహితుల ముందు తండ్రి మందలించాడని.. విషం తాగిన 13 ఏళ్ల బాలిక

Father scolded her in front of her friends, daughter consumed poison. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాల విద్యార్థుల ముందే ఓ వ్యక్తి తన కుమార్తెను

By అంజి  Published on  25 Feb 2022 8:23 PM IST
స్నేహితుల ముందు తండ్రి మందలించాడని.. విషం తాగిన 13 ఏళ్ల బాలిక

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాల విద్యార్థుల ముందే ఓ వ్యక్తి తన కుమార్తెను తిట్టాడు. దీంతో షాక్‌కు గురైన ఆమె ఇంటికి వచ్చి విషం తాగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ ఘటన ఉదయ్‌పూర్ జిల్లాలోని ఫలాసియాలోని బిచ్చివారాలో చోటుచేసుకుంది. 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలిక మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలిక బిచ్చివారా సీనియర్‌ స్కూల్‌లో చదువుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఫిబ్రవరి 22, 2022న, ఆమెకు హిందీ ప్రీ-బోర్డ్ పేపర్ ఉంది. ఆ సమయంలో ఆమె వద్ద ఓ స్లిప్ దొరికింది.

ఆ తర్వాత అదే స్కూల్‌లో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న అతని తండ్రి హేమ్‌రాజ్‌ అందరి ముందు ఆమెను తిట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె విషపూరితమైన పదార్థాన్ని సేవించింది. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం ఉదయం బాలిక మరణవార్త అందుకున్న సీబీఈవో కూడా పాఠశాలకు చేరుకుని జరిగిన పరిణామాలను పరిశీలించారు. పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని పోలీసులు తెలిపారు. అప్పుడే తదుపరి చర్యలు తీసుకుంటారు. తిట్టడంతో పాటు తండ్రి బాలికను గట్టిగా చెప్పుతో కొట్టాడని పాఠశాలలో చదువుతున్న బాలికలు తెలిపారు.

Next Story