దారుణం.. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే
Father Raped Her Daughter in Anantapur District.దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై దారుణాలు
By తోట వంశీ కుమార్ Published on 25 Nov 2021 9:50 AM ISTదేశంలో ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై దారుణాలు ఆగడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు వావి వరుసలు మరిచిపోయి అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కూతురి పట్ల రాక్షసంగా ప్రవర్తించాడు. ఫలితంగా కుమారై గర్భం దాల్చింది. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో చోటుచేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి. గుంతకల్లులోని భాగ్యనగర్‌లో ఓ వ్యక్తి.. భార్య, ఇద్దరు కుమారైలతో కలిసి నివసిస్తున్నాడు. ఇతడు పెయింటింగ్ పనులు చేస్తుండేవాడు. పెద్ద కుమారై ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించేవాడు. దీంతో బాలిక మిన్నుకుండిపోయింది. ఇదే అదునుగా బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల బాలిక కడుపులో నొప్పి అని చెప్పడంతో తల్లి ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. బాలిక గర్భం దాల్చినట్లు తెలిసింది.
ఏం జరిగిందని తల్లి.. విషయాన్ని ఆరా తీయగా.. తనపై జరుగుతున్న దారుణాన్ని వివరించింది. భర్తను అడుగగా.. ఇద్దరిని చంపేస్తానని బెదిరించాడు. బాలికను తల్లి మరో ఆస్పత్రికి తీసుకెళ్లి.. మరోసారి వైద్య పరీక్షలు చేయించింది. ఐదు నెలల గర్భంతో ఉందని వారు చెప్పారు. గర్భాన్ని తీసివేయాలని తల్లి వైద్యులను కోరింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై గుంతకల్లు వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.