దారుణం.. ఐదేళ్ల కుమారైపై తరచూ తండ్రి అత్యాచారం
Father Molested five years daughter in Palnadu District.ఇటీవల కాలంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 26 April 2022 4:18 AM GMT
ఇటీవల కాలంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు వావి వరుసలను చూడడం లేదు. అభం శుభం తెలియని ఐదేళ్ల కుమారై పై సొంత తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గుర్తించిన భార్య.. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో ఈ దారుణ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే.. బొప్పూడి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి 2016లో నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెేనికి చెందిన ఓ యువతితో వివాహం జరిగింది. వీరికి ఓ పాప, బాబు ఉన్నారు. పాపకు ఐదేళ్లు. భర్త బొప్పూడిలో ఉంటూ చిలకలూరిపేటలోని ఓ దుకాణంలో పని చేస్తున్నాడు. కుమార్తె ఓ పాఠశాలలో చదువుకుంటోంది. కాగా.. చిన్నారికి తల్లి స్నానం చేయించేటప్పుడు తన మర్మాంగం వద్ద నొప్పిగా ఉంటుందని, రాత్రి సమయంలో నాన్న వద్ద పడుకోపెట్టవద్దని ఏడుస్తూ చెప్పింది.
పాపను ఓదార్చింది తల్లి. చిన్నారి చెప్పిన విషయంతో ఆమె ఆలోచనల్లో పడింది. భర్తపై నిఘా పెట్టింది. ఆదివారం రాత్రి భోజనం చేసిన అనంతరం అందరూ పడుకున్నారు. అయితే.. భర్త తాను బయటకు వెళ్లి వస్తానని చెప్పి రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. భార్య నిద్రపోయిందా లేదా అని ఆమె భర్త సెల్‌ఫోన్ లైట్ వేసి చూశాడు. ఆ సమయంలో భార్య నిద్రపోతున్నట్లుగా నటించింది. భార్య నిద్రపోతుందని బావించిన అతడు కూతురు పక్కన పడుకుని సెల్‌ఫోన్‌లో అసభ్య చిత్రాలు చూస్తూ కుమారై పై అత్యాచారానికి పాల్పడుతుండగా.. భార్య అతడిని పట్టుకుంది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిలకలూరిపేట గ్రామీణ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. చిన్నారిని వైద్య పరీక్షల కోసం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.