పదవిపై వ్యామోహంతో కన్నకూతురికే మరణశాసనం..కాలువలోకి తోసి చంపిన తండ్రి
మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి తన మైనర్ కుమార్తెను చంపి, ఆమె మృతదేహాన్ని నిజామాబాద్‌లోని కాలువలో పడేశాడని పోలీసులు తెలిపారు
By - Knakam Karthik |
పదవిపై వ్యామోహంతో కన్నకూతురికే మరణశాసనం..కాలువలోకి తోసి చంపిన తండ్రి
నిజామాబాద్: సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత సాధించడం కోసం మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి తన మైనర్ కుమార్తెను చంపి, ఆమె మృతదేహాన్ని నిజామాబాద్‌లోని కాలువలో పడేశాడని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మహారాష్ట్రలో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. కెరూర్‌కు చెందిన పాండురంగ అనే వ్యక్తి సర్పంచ్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు.
అయితే తనకు ముగ్గురు పిల్లలు ఉండటంతో అనర్హుడినవుతానని భావించి పెద్ద కూతురు ప్రాచీ (6)ని హత్య చేశాడు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రస్తుత సర్పంచ్ గణేశ్‌ను కలిసి చెప్పాడు. ముగ్గురు పిల్లల్లో ఒకరిని అడ్డు తొలగించుకోవాలని సర్పంచ్ సూచించాడు. దీంతో ఇరువురు కలిసి ప్రాచీని నిజామాబాద్ జిల్లాలోని ఏఆర్పీ నిజాం సాగర్ కాలువలోకి తోసేసి చంపేశారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు.
ఇటీవల బాలిక మృతదేహం కాలువలో లభ్యం కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా, తండ్రి హంతకుడు అని గుర్తించారు. హత్యకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీయగా ఈ దారుణం వెలుగు చూసింది. తండ్రి పాండురంగను, గణేశ్‌ను నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సొంత కూతురిని చంపిన తండ్రిమహారాష్ట్రలోని కేరూరులో సర్పంచ్‌గా పోటీ చేయాలని భావించిన పాండురంగ అనే వ్యక్తిఅయితే ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అర్హత లేకపోవడంతో పెద్ద కూతురు ప్రాచీని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి వద్ద నిజాంసాగర్ కెనాల్లో తోసి చంపేసిన… pic.twitter.com/YChCYlXhwT
— Telugu Scribe (@TeluguScribe) February 2, 2026