కూతురు ఫోన్ ఎక్కువ‌గా మాట్లాడుతుంద‌ని..

Father kills daughter in Musheerabad.సెల్ ఫోన్ ఎక్కువ‌గా మాట్లాడుతోంద‌ని కూతురిని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Dec 2022 6:01 AM GMT
కూతురు ఫోన్ ఎక్కువ‌గా మాట్లాడుతుంద‌ని..

సెల్ ఫోన్ ఎక్కువ‌గా మాట్లాడుతోంద‌ని కూతురిని పిన తండ్రి హత్య చేశాడు. ఈ దారుణ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలోని ముషీరాబాద్‌లో చోటు చేసుకుంది.

ముషీరాబాద్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని బాకారంలో యాస్మిన్ ఉన్నిసా(17) త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తోంది. యాస్మిన్ త‌ల్లిని సాదిక్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇటీవ‌ల ఆమె రాత్రి వేళ ఎక్కువ‌గా ఫోన్ మాట్లాడుతుండ‌డాన్ని సాధిక్‌ గ‌మ‌నించాడు. ఫోన్ మాట్లాడ వ‌ద్దంటూ కూతురికి ప‌లు మార్లు సూచించాడు. ఉన్నిసా అత‌డి మాటల‌ను లెక్క‌చేయ‌లేదు.

ఆదివారం కూడా కూతురు ఫోన్‌లో మాట్లాడ‌డాన్ని గ‌మ‌నించిన సాధిక్ నా మాట‌ను లెక్క చేయ‌వా అంటూ కోపంతో ఊగిపోయాడు. యాస్మిస్ కూడా పిన తండ్రిని ఎదురించి మాట్లాడింది. దీంతో ఆగ్ర‌హానికి లోనైన సాధిక్‌.. యాస్మిన్ ఫోన్ ను లాక్కుకున్నాడు. ఈ క్ర‌మంలో ఇరువురు గొడ‌వ‌కు దిగారు. యాస్మిన్ గొంతు నులిపి చంపేశాడు. అనంత‌రం ముషీరాబాద్ పోలీస్ స్టేష‌న్‌లో లొంగిపోయాడు. పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మృత‌దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story