కోడి కూర రుచి చూడలేదని.. కొడుకును చంపిన తండ్రి

కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇంట్లో చేసిన వంటకం రుచి చూడలేదని

By అంజి  Published on  6 April 2023 8:45 AM IST
Karnataka, Crime news

కోడి కూర రుచి చూడలేదని.. కొడుకును చంపిన తండ్రి

కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇంట్లో చేసిన వంటకం రుచి చూడలేదని కొడుకుతో గొడవ పడ్డాడో తండ్రి. అదే సమయంలో కోపోద్రిక్తుడైన తండ్రి చెక్కతో కొట్టడంతో 32 ఏళ్ల వ్యక్తి మరణించాడని పోలీసులు బుధవారం తెలిపారు. ఈ ఘటన మంగళవారం జిల్లాలోని సుల్లియా తాలూకా గుత్తిగర్‌లో జరిగినట్లు వారు తెలిపారు. ఇంట్లో కోడి కూర తినాలనే విషయంపై తండ్రి షీనాతో మాటల వాగ్వాదం జరగింది. దీంతో తండ్రి చేతిలో హత్యకు గురయ్యాడు కొడుకు.

మృతుడిని శివరామ్‌గా పోలీసులు గుర్తించారు. శివరాం పని మీద బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే సమయానికి ఇంట్లో తండ్రి చికెన్‌ కర్రీ తయారు చేశాడు. ఇంటికి వచ్చిన శివరామ్‌ని తండ్రి చికెన్‌ కర్రీ రుచి చూడమన్నాడు. దీంతో కొడుకు తన తండ్రితో గొడవ పడ్డాడు. అతను కోపంతో శివరామ్‌ను చెక్కతో కొట్టాడు, ఫలితంగా అతను మరణించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సుబ్రహ్మణ్య పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Next Story