పరువు హత్య కలకలం.. కూతురిని నీటిలో ముంచి చంపిన తండ్రి

Father drowns daughter over love affair in Karnataka. కర్ణాటకలో పరువు హత్య ఘటన కలకలం రేపుతోంది. తన కుమార్తె వేరే వర్గానికి చెందిన అబ్బాయితో సంబంధం

By అంజి  Published on  9 Nov 2022 11:08 AM IST
పరువు హత్య కలకలం.. కూతురిని నీటిలో ముంచి చంపిన తండ్రి

కర్ణాటకలో పరువు హత్య ఘటన కలకలం రేపుతోంది. తన కుమార్తె వేరే వర్గానికి చెందిన అబ్బాయితో సంబంధం పెట్టుకుందని కోపంతో తండ్రి నీట ముంచి చంపాడు. ఈ ఘటన బళ్లారి జిల్లాలో చోటుచేసుకుంది. తన కూతురికి పలుమార్లు వార్నింగ్ ఇచ్చినప్పటికీ.. అతడితో ప్రేమ సంబంధాన్ని కొనసాగించాలని నిశ్చయించుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన అతడు తన కూతురిని బళ్లారి జిల్లా కుడతిని పట్టణంలోని నీటికుంటలోకి తోసేశాడు. నేరం చేసిన తర్వాత పోలీసులను ఆశ్రయించగా.. తన కూతురిని తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు.

అక్టోబర్ 31వ తేదీన ఈ నేరం జరగగా.. నిందితుడు ఓంకార్ గౌడ్ తన కూతురిని సినిమాకి తీసుకెళ్తానని చెప్పాడు. ఇద్ద‌రూ త‌మ ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లారు. కానీ సినిమాకి ఆల‌స్యంగా వెళ్లారు. ఆ తర్వాత వారు థియేటర్ నుండి బయలుదేరి ఒక ఆలయానికి వెళ్లారు. ఆపై అతను సమీపంలోని దుకాణంలో ఆమెకు నగలను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఆమెను ఆ ప్రాంతంలోని హైలెవల్ కెనాల్ వద్దకు తీసుకెళ్లి నీటిలోకి తోసేశాడు. సహాయం కోసం బాలిక కేకలు వేసినప్పటికీ, ఆమె తండ్రి సహాయం చేయలేదు.

దీంతో ఆమె నీటిలో మునిగిపోయింది. హత్య అనంతరం రాత్రికి రాత్రే తిరుపతికి పారిపోయాడు. అయితే, బాలిక తల్లి, సోదరుడు కుడథిని పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. మంగళవారం తండ్రి ఓంకార్ గౌడ్ తిరిగి రాగా, పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా.. తన కుమార్తెను తానే హత్య చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. బాలిక మృతదేహం కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Next Story