దారుణం..ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న తండ్రి

సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు.

By Knakam Karthik
Published on : 5 May 2025 2:10 PM IST

Crime News, Sangareddy District, Father Committed To Suicide

దారుణం..ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న తండ్రి

సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు మారిన్ (13), ఆరాధ్య (10), సుభాష్ (42)లుగా గుర్తించారు. భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందన్న మనస్తాపంతోనే సుభాష్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి పరిధిలో నివాసముంటున్న సుభాష్, మంజుల దంపతులకు గత కొన్ని రోజుల క్రితం భార్య మంజుల పుట్టింటికి వెళ్లిపోవడంతో సుభాష్ తన పిల్లలతో కలిసి ఉంటున్నాడు. కుమారుడు, కుమార్తెకి ఉరివేసి...అనంతరం సుభాష్ కూడా ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య మంజుల (35) కి వేరొకరితో వివాహేతర సంబంధం ఉన్నట్టు సమాచారం...గత కొన్ని రోజులుగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో విసుగు చెందిన భార్య మంజుల తన పుట్టింటికి వెళ్ళిపోయింది. భార్య వెళ్లిపోవడం తో తీవ్ర మనస్థాపా నికి గురైన సుభాష్ తన ఇద్దరు పిల్లల్ని ఉరివేసి చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు.

Next Story