అమానుషం.. 10 ఏళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం

Father arrested for sexually assaulting 10-year-old daughter. దేశంలో ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా.. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. అదును దొరికితే చాలు

By అంజి  Published on  5 March 2022 1:20 PM IST
అమానుషం.. 10 ఏళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం

దేశంలో ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా.. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. అదును దొరికితే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కొందరు మానవమృగాలు. తాజాగా తన 10 ఏళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ తండ్రి. ఈ ఘటన గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌లో జరిగింది. నిందితుడిని సూరత్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక రక్తపు మడుగులో, ఆమె ప్రైవేట్ పార్ట్‌లో గాయాలతో కనిపించింది. ఆమెకు శస్త్ర చికిత్స చేసి నాలుగు కుట్లు వేసి ప్రస్తుతం ఐసీయూ వార్డులో చేర్చారు. బాలిక తన తల్లిదండ్రులు, ఇద్దరు తమ్ముళ్లతో ఉంటోంది. కుటుంబం పని వెతుక్కుంటూ సూరత్‌కు వలస వెళ్లింది.

ఈ క్రమంలోనే బాలిక తల్లి పనికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి రక్తపు మడుగులో కూతురు కనిపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించి బాలికను ఆస్పత్రికి తరలించారు. నిందితుడి పట్టుకునేందుకు పోలీసులు పలు బృందాలను ఏర్పాటు చేశారు. పొడవాటి జుట్టుతో, బహుశా నేపాల్ మూలానికి చెందిన ఓ గుర్తుతెలియని వ్యక్తి తనపై అత్యాచారం చేసి తప్పించుకున్నాడని బాలిక మొదట్లో చెప్పింది. అయితే పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా బాలిక మేనమామ, తండ్రి ఇంటికి వచ్చినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమగ్ర విచారణ అనంతరం తండ్రి నేరాన్ని అంగీకరించాడు. బాలికపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడని, తన పేరు చెప్పవద్దని, పోలీసులకు, డాక్టర్‌కు తప్పుడు కథనం చెప్పాలని బాలికను పోలీసు అధికారులు తెలిపారు.

Next Story