వ్యాన్​, ప్రైవేట్​ బస్సు ఢీ.. ఆరుగురు దుర్మరణం

Fatal road accident in Salem, Tamil Nadu.. Six people died. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన వ్యాన్‌, ఓ ప్రైవేట్‌ బస్సు బలంగా ఢీ కొట్టుకున్నాయి.

By అంజి  Published on  23 Aug 2022 2:15 PM IST
వ్యాన్​, ప్రైవేట్​ బస్సు ఢీ.. ఆరుగురు దుర్మరణం

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన వ్యాన్‌, ఓ ప్రైవేట్‌ బస్సు బలంగా ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సేలం జిల్లా అత్తూరు సమీపంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నెల రోజుల కిందట మరణించిన ఆరుముగం సంతాప సభకు 11 మంది బంధువులు వెళ్లారు. ఓమ్నీ వ్యాన్‌లో తిరిగి ఇంటికి వస్తుండగా ఈ విషాద సంఘటన జరిగింది.

అత్తూరులో కాసేపు విరామం కోసం ఆగిన తర్వాత.. బంధువుల బృందం ఓమ్నీ వ్యాన్‌లో సేలం - చెన్నై హైవేపై ప్రయాణం ప్రారంభించింది. వాహనం డ్రైవర్‌ రాజేష్‌.. రోడ్డు లైన్‌కు కుడి వైపున నడుపుతూ అండర్‌పాస్ తీసుకుంటుండగా, ఒట్టమ్ పరై బ్రిడ్జి సమీపంలో వేగంగా వస్తున్న బస్సును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనం డ్రైవర్ రాజేష్, సంధ్య, శరణ్య, రమ్య, సుగన్య అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రయాణికులు అధికారులకు సమాచారం అందించి ప్రాణాలతో ఉన్న వారిని అత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సేలంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పదకొండేళ్ల బాలిక మృతి చెందింది. ప్రమాదం జరిగిన తర్వాత ఏటూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంగళవారం.. సేలం జిల్లా కలెక్టర్ కర్మేగం పరామర్శించారు. అనంతరం ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.

Next Story