ఏపీలో నెత్తురోడిన రోడ్లు.. ఆరుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట వద్ద నార్పలవైపు వెళ్తున్న కారును లారీ ఢీ కొట్టింది.

By అంజి  Published on  22 Sept 2024 7:57 AM IST
Fatal road accident, APnews, Lorry collided with a car, Crime

ఏపీలో నెత్తురోడిన రోడ్లు.. ఆరుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట వద్ద నార్పలవైపు వెళ్తున్న కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. రోడ్డు ప్రమాదం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులు అనంతపురం సిండికేట్‌నగర్ వాసులు అని పోలీసులు తెలిపారు.

మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు కారులో ఓ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అటు తిరుపతి జిల్లా చిల్లకూరు మండల కేంద్రంలో తెల్లవారుజామున ఆగి ఉన్న కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి.

Next Story