తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాకాల మండలం తోటపల్లి వద్ద పూతలపట్టు-నాయుడుపేట నేషనల్ హైవేపై స్పీడ్‌గా వెళ్తున్న ఓ కారు కంటైనర్ కిందకు దూసుకెళ్లడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు స్పాట్‌లోనే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను స్థానికులు సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.