లండన్: తూర్పు ఇంగ్లాండ్‌లోని లీసెస్టర్‌షైర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 32 ఏళ్ల విద్యార్థి మరణించగా, మరో నలుగురు వ్యక్తులు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారని పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన చిరంజీవి పంగులూరి.. కారు అదుపు కాలువలో పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ముగ్గురు సహ ప్రయాణికులైన.. ఒక మహిళ, ఇద్దరు పురుషులు, డ్రైవర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించినట్లు లీసెస్టర్‌షైర్ పోలీసులు తెలిపారు. చిరంజీవి 15 నెలల క్రితం ఎంఎస్ చేసేందుకు యూకే వెళ్లారు.
"చిరంజీవి పంగులూరి (32) బూడిద రంగు మాజ్డా 3 తమురాలో ప్రయాణిస్తున్నాడు, ఇది లీసెస్టర్ నుండి మార్కెట్ హార్బరో వైపు కౌంటీకి వెళుతున్నప్పుడు ప్రమాదం జరిగింది" అని పోలీసు ప్రకటన పేర్కొంది. "లీసెస్టర్‌కు చెందిన పంగులూరి సంఘటనా స్థలంలో మరణించినట్లు ప్రకటించారు. వాహనంలో ఉన్న మరో ముగ్గురు ప్రయాణికులు, ఒక మహిళ, ఇద్దరు పురుషులు, డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు మగ ప్రయాణికులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉన్నారు. ప్రాణహాని కాదు" అని తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న వారంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని సమాచారం. మృతుడి భౌతికకాయాన్ని తక్షణమే రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని మంత్రి లోకేష్‌ను మృతుడి తల్లిదండ్రులు కోరారు.