హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌లో వివాహిత మాధవి హత్య కేసు తెలంగాణలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు విచారణపై రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు కీలక ప్రకటన చేశారు. మాధవి హత్యకేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తులో సేకరించిన సైంటిఫిక్ ఆధారాలను కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. ఈ మేరకు రంగారెడ్డి కోర్టులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశారు. అయితే విచారణ చేపట్టిన రెండు నెలల్లోనే తీర్పు వస్తుందని పేర్కొన్నారు. ఈనెల 17వ తేదీ నుంచి మాధవి హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు రోజువారీ ట్రయల్స్ జరపనుంది. కాగా ఈ సంవత్సరం జనవరి నెలలో మాధవిని ముక్కలు ముక్కలుగా నరికి భర్త గురుమూర్తి అతి కిరాతకంగా హత్య చేశాడు.