అయ్యో రైతన్నా.. బ్యాంకులోనే ప్రాణాలు తీసుకుంటివా.?

బ్యాంకు అధికారుల వేధింపులకు ఓ రైతు ప్రాణం తీసుకున్నారు. వేధింపులు తాళలేక బ్యాంకులోనే పురుగుల మందు తాగాడు.

By Medi Samrat  Published on  18 Jan 2025 7:11 PM IST
అయ్యో రైతన్నా.. బ్యాంకులోనే ప్రాణాలు తీసుకుంటివా.?

బ్యాంకు అధికారుల వేధింపులకు ఓ రైతు ప్రాణం తీసుకున్నారు. వేధింపులు తాళలేక బ్యాంకులోనే పురుగుల మందు తాగాడు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఆదిలాబాద్ టౌన్ లోని ఓ ప్రైవేట్ బ్యాంక్ లో బేల మండలం రేణి గూడకు చెందిన రైతు జాదవ్ దేవరావు రూ. 3.50 లక్షల లోన్ తీసుకున్నాడు. బ్యాంక్ సిబ్బంది ఫోన్లు చేసి వేధిస్తున్నారని జాదవ్ దేవ్ రావు ఆరోపించారు.

బ్యాంక్ కు వచ్చిన జాదవ్ దేవ్ రావు బ్యాంక్ లోపలే పురుగుల మందు తాగాడు. హుటాహుటిన రిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే జాదవ్ దేవ్ రావు మృతి చెందాడు. జాదవ్ దేవ్ రావు మృతితో అతని కుటుంబ సభ్యులు బ్యాంక్ ముందు ఆందోళనకు దిగారు. తీసుకున్న అప్పు చెల్లించడం లేదని దేవరావును బ్యాంక్ అధికారులు పిలిచారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తనకు ఉన్న ఐదెకరాల వ్యవసాయ భూమిని మార్టిగేజ్‌ చేసి 3.50 లక్షల రూపాయల రుణం తీసుకున్నాడు. దీనికి ఆరు నెలలకు ఒకసారి 25వేల కిస్తీ చెల్లించాల్సి ఉంది. జాదవ్‌ ఇటీవల కిస్తీ చెల్లించలేకపోయాడు. దీంతో బ్యాంకు అధికారులు జాదవ్‌ పై ఒత్తిడి తీసుకొచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం ఉదయం పురుగుల మందు డబ్బాతో బ్యాంకుకు వచ్చాడు. అధికారుల ముందే పురుగుల మందు తాగాడు.


Next Story