భార్య ఎక్సైజ్ సీఐ.. వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య

సికింద్రాబాద్‌లోని నేరేడ్‌మెట్‌లో ఎక్సైజ్ సీఐగా పనిచేస్తున్న భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది.

By -  Knakam Karthik
Published on : 12 March 2026 12:45 PM IST

Crime News, Hyderabad, Neredmet, Secunderabad, Excise CI, Suicide Case, Harassment

భార్య ఎక్సైజ్ సీఐ.. వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య

సికింద్రాబాద్‌లోని నేరేడ్‌మెట్‌లో ఎక్సైజ్ సీఐగా పనిచేస్తున్న భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. సుమారు 13 ఏళ్ల క్రితం శ్రీనివాస్, జ్యోతిల వివాహం జరగ్గా, జ్యోతి ఎక్సైజ్ సీఐగా ఉద్యోగంలో చేరినప్పటి నుండి తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తోందని మృతుడు తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.

తనపై అక్రమ కేసులు బనాయించి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తన మరణానికి భార్య జ్యోతియే పూర్తి కారణమని లేఖలో రాసి శ్రీనివాస్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story