తన ప్రియురాలి ఆత్మహత్యతో కలత చెందిన ఒక వ్యక్తి శనివారం లక్నోలో ఆమె తల్లిపై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడిందని అధికారులు తెలిపారు. ఆమెను కాపాడే ప్రయత్నంలో ఆ మహిళ కుమారుడు కూడా గాయపడ్డాడు. నిందితుడు వినీత్ అలియాస్ గోలు రావత్, 42 ఏళ్ల అంజు గౌతమ్ కుమార్తె మోహినితో సంబంధం కలిగి ఉన్నాడని పోలీసులు తెలిపారు. దాదాపు నెలన్నర క్రితం, కుటుంబ సభ్యులు తిట్టడంతో మోహిని పైకప్పుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
రక్షా బంధన్ కోసం తన కుమారుడు మోహిత్‌తో కలిసి కథ్వారా గ్రామంలోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిన అంజు తిరిగి వస్తుండగా.. మోహిని మరణంతో కోపంతో ఉన్న వినీత్ ఆమెను వెంబడించాడు. దాడి సమయంలో, మోహిత్ అడ్డుకోవడానికి ప్రయత్నించగా గాయపడ్డాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు, వారు సంఘటనా స్థలానికి చేరుకుని అంజును రామ్ సాగర్ మిశ్రా జాయింట్ ఆసుపత్రికి తరలించారు. తరువాత ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో బలరాంపూర్ ఆసుపత్రికి తరలించారు. మోహిత్ చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యాడు. దాడి తర్వాత వినీత్ పారిపోయాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.