నిశ్చితార్థం రద్దు.. బాలికను నరికి చంపి.. తలతో పారిపోయిన నిందితుడు

కర్నాటకలోని కొడగు జిల్లా దారుణ ఘటన జరిగింది. సోమవారపేటలోని ముట్లు గ్రామంలో 16 ఏళ్ల బాలికను నరికి చంపి, నరికిన తలతో నిందితుడు పరారయ్యారు.

By అంజి  Published on  10 May 2024 3:06 PM IST
Engagement, Karnataka , Crime

నిశ్చితార్థం రద్దు.. బాలికను నరికి చంపి.. తలతో పారిపోయిన నిందితుడు

కర్నాటకలోని కొడగు జిల్లా దారుణ ఘటన జరిగింది. సోమవారపేటలోని ముట్లు గ్రామంలో 16 ఏళ్ల బాలికను నరికి చంపి, నరికిన తలతో నిందితుడు పరారయ్యారు. నిందితుడు ప్రకాష్ (32)గా గుర్తించబడ్డాడు. బాలికతో నిందితుడికి నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అయితే మే 9న బాలిక నిశ్చితార్థాన్ని మహిళా శిశు అభివృద్ధి శాఖ అధికారులు నిలిపివేశారు. అధికారులు బాలిక తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లిని రద్దు చేసేలా చేశారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం 5:30 గంటలకు ప్రకాష్ బాలిక ఇంట్లోకి చొరబడి ఆమెను బయటకు లాగి తల నరికాడు. అనంతరం బాలిక నరికిన తలను తీసుకుని పారిపోయాడు.

ప్రస్తుతం ప్రకాష్‌ పరారీలో ఉన్నాడు. బాలిక ఇటీవల రాష్ట్ర బోర్డ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షల్లో 52% మార్కులు సాధించింది. నిందితుడి కోసం పోలీసులు వేట ప్రారంభించారు. బాధితురాలి తల్లి గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. హత్య వెనుక గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. "నిందితుడు పరారీలో ఉన్నాడు, మేము అతని కోసం వెతుకుతున్నాము. సాంఘిక సంక్షేమ విభాగానికి చెందిన చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారులు నిశ్చితార్థాన్ని నిలిపివేసినట్లు మాకు చెప్పబడింది. మాకు ఇంకా అసలు ఉద్దేశ్యం తెలియలేదు" అని ఒక పోలీసు అధికారి తెలిపారు.

Next Story