గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం

గుంటూరు జిల్లా పెదకాకాని గోశాల వద్ద సోమవారం జరిగిన విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు.

By Medi Samrat  Published on  24 Feb 2025 8:02 PM IST
గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం

గుంటూరు జిల్లా పెదకాకాని గోశాల వద్ద సోమవారం జరిగిన విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. కాశీ గార్డెన్స్‌ రోడ్‌ గోశాల వద్ద సంప్‌ను శుభ్రపరిచే పనిలో నిమగ్నమై విద్యుదాఘాతంతో ముగ్గురు కూలీలు, ఓ రైతు మృతి చెందారు. గోశాల వద్ద సంపులో పూడిక తీస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుది. ఒక రైతుతో పాటు ముగ్గురు కూలీలు మృతి చెందారు. సంపులో పూడిక తీసివేతకు రైతు కూలీలను మాట్లాడుకుని ఆ పని చేస్తుండగా ఈ విషాదం జరిగినట్లు తెలుస్తోంది.

Next Story