65 ఏళ్ల వృద్ధురాలిని కట్టేసి.. ఆపై

Elderly woman tied, robbed of jewellery by masked man. చెన్నైలోని తిరువికా నగర్‌లో మంగళవారం నాడు 65 ఏళ్ల మహిళ ఇంట్లో దొంగతనం జరిగింది. నిందితుడు బంగారు నగలు, మొబైల్

By అంజి
Published on : 24 Feb 2022 9:04 PM IST

65 ఏళ్ల వృద్ధురాలిని కట్టేసి.. ఆపై

చెన్నైలోని తిరువికా నగర్‌లో మంగళవారం నాడు 65 ఏళ్ల మహిళ ఇంట్లో దొంగతనం జరిగింది. నిందితుడు బంగారు నగలు, మొబైల్ దోచుకెళ్లాడు. ఇంట్లోకి చొరబడిన నిందితుడు ఆమెను ఇంటిలోపల కట్టేసి ఆరు సవర్ల బంగారం, మొబైల్ ఫోన్ దోచుకెళ్లాడు. ఆ వ్యక్తి తన ముఖాన్ని హెల్మెట్‌తో కప్పుకున్నాడు. బాధితురాలిని కెన్నెడీ స్క్వేర్‌కు చెందిన అశ్వంత జయకుమారిగా గుర్తించారు. రిపోర్ట్‌ ప్రకారం.. జయకుమారి తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు ఇంట్లోకి ప్రవేశించి ఆమెను దాడి చేశాడు. ఈ ఘటన జరిగినప్పుడు జయకుమారి కూతురు పని నిమిత్తం బయటకు వచ్చింది.

మహిళను కట్టేసి నగలు దోచుకెళ్లారు

ముసుగు ధరించిన వ్యక్తి లోపలి నుండి తలుపు గడియపెట్టి, మహిళ చేతులను గుడ్డతో కట్టి, బంగారు ఆభరణాలను దోచుకున్నాడు. మహిళ మెడలోని గొలుసు, చెవి కమ్మలు, ఉంగరాలు ఎత్తుకెళ్లాడు. సాయంత్రం అపస్మారక స్థితిలో పడి ఉన్న బాధితురాలిని ఇరుగుపొరుగు వారు గమనించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వృద్ధురాలిని వైద్య చికిత్స నిమిత్తం రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, తిరువికా నగర్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అతడి కోసం గాలింపు చేపట్టారు.

Next Story