Hyderabad: స్లోగా వెళ్లమన్నందుకు వృద్ధుడిని కొట్టి చంపేశాడు.. వీడియో

నిదానంగా వెళ్లాలని సూచించిన ఓ వృద్ధుడిపై వాహనదారుడు దాడి చేయడంతో అతడు మరణించాడు.

By అంజి  Published on  18 Oct 2024 8:30 AM IST
Elderly Hyderabad man, biker, Crime, Hyderabad

Hyderabad: స్లోగా వెళ్లమన్నందుకు వృద్ధుడిని కొట్టి చంపేశాడు.. వీడియో

హైదరాబాద్‌: నిదానంగా వెళ్లాలని సూచించిన ఓ వృద్ధుడిపై వాహనదారుడు దాడి చేయడంతో అతడు మరణించాడు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లోని అల్వాల్‌లో ఆంజనేయులు (65) అనే వృద్ధుడు రోడ్డు దాటుతుండగా ఓ వ్యక్తి బైక్‌పై వేగంగా వచ్చాడు. మోటర్‌బైక్‌పై అతివేగంగా , నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్న అతడికి నెమ్మదిగా నడపమని వృద్ధుడు సలహా ఇచ్చాడు. దీంతో నిదానంగా వెళ్లాలని ఆ ముసలాయన సూచించగా కోపోద్రిక్తుడైన వాహనదారుడు వృద్ధుడిని కింద పడేసి కొట్టాడు.

బైకర్ ఆవేశంతో, వృద్ధుడిని కొట్టడం, అతను నేలపై పడిపోవడం, తలకు బలమైన గాయం కావడం సీసీ ఫుటేజీలో కనిపించింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ వృద్ధుడు కన్నుమూశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మోటర్‌ బైక్‌ నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన సెప్టెంబర్ 30న జరిగినప్పటికీ, ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు అక్టోబర్ 17, గురువారం సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

Next Story