వాటర్ ట్యాంక్‌లో దంపతుల మృతదేహాలు.. రెండు రోజులుగా..

రాజస్థాన్‌లోని నాగౌర్‌లో 70 ఏళ్ల వృద్ధుడు, అతని భార్య తమ ఇంటి వాటర్ ట్యాంక్‌లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు గురువారం తెలిపారు.

By అంజి  Published on  11 Oct 2024 6:48 AM IST
Elderly couple, suicide, Rajasthan, harassment , Crime

వాటర్ ట్యాంక్‌లో దంపతుల మృతదేహాలు.. రెండు రోజులుగా..

రాజస్థాన్‌లోని నాగౌర్‌లో 70 ఏళ్ల వృద్ధుడు, అతని భార్య తమ ఇంటి వాటర్ ట్యాంక్‌లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు గురువారం తెలిపారు. తమ ఇంటిలో గోడలపై అతికించిన సూసైడ్ నోట్‌లో.. తన కొడుకులు, కోడలు, ఇతర బంధువులు ఆస్తి విషయాలపై వేధిస్తున్నారని ఆరోపించారు.

హజారీరామ్ బిష్ణోయ్ (70), అతని 68 ఏళ్ల భార్య చావలీ దేవి అనే దంపతుల మృతదేహాలను గురువారం కర్ని కాలనీలోని వారి ఇంటిలోని వాటర్ ట్యాంక్ నుండి స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజులుగా దంపతులు కనిపించకపోవడంతో ఇరుగుపొరుగు వారు ఆందోళన చెంది కుమారుడిని అప్రమత్తం చేశారు. కొడుకు స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు, సంఘటన స్థలానికి చేరుకున్న వారు ట్యాంక్ మూత తెరిచి, దంపతుల మృతదేహాలు నీటిలో తేలుతూ కనిపించారు.

మృతదేహాలను ట్యాంక్‌లో నుంచి బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం పంపినట్లు కొత్వాలి పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మనీష్ దేవ్ తెలిపారు. "విష్ణోయ్ మృతదేహానికి శవపరీక్ష పూర్తి కాగా, అతని భార్య మృతదేహానికి శుక్రవారం ఉదయం శవపరీక్ష నిర్వహిస్తారు" అని మనీష్ దేవ్ పేర్కొన్నట్లు వార్తా సంస్థ పిటిఐ పేర్కొంది. విష్ణోయ్ వదిలి వెళ్లిన నోట్ ప్రకారం, అతని కొడుకులు , బంధువులు తనను వేధిస్తున్నారని SHO తెలిపారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

Next Story