హైదరాబాద్‌లోని దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతులపై దాడి జరిగింది. హిమాయత్‌నగర్ స్ట్రీట్ నంబర్ 6లోని హెరిటేజ్ అపార్ట్మెంట్స్‌లో నివసించే ఈ వృద్ధ దంపతులు దాదాపు ఎనిమిది నెలల క్రితం గుంటూరు జిల్లాకు చెందిన గోవర్ధన్‌ను కేర్ టేకర్‌గా నియమించుకున్నారు. అయితే కేర్ టేకర్ గోవర్ధన్ తమపై దాడి చేసి ఇంట్లోని 8 తులాల బంగారంతో పరారయ్యాడు..అని ఆనందరావు, అన్నపూర్ణ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. వృద్ధ దంపతుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న దోమలగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.