8 ఏళ్ల బాలికపై అత్యాచారం.. పరిస్థితి విషమం

ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఎనిమిదేళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడ్డు.

By అంజి  Published on  26 Sept 2023 1:30 PM IST
Uttar Pradesh, Crime news, MATHURA

8 ఏళ్ల బాలికపై అత్యాచారం.. పరిస్థితి విషమం

ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఎనిమిదేళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడ్డు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉందని అధికారులు మంగళవారం నాడు తెలిపారు. సోమవారం సాయంత్రం తన ఇంటి సమీపంలోని పార్కులో పాక్షిక స్పృహలో ఉన్న బాలికను గుర్తించి స్థానికులు.. పరిస్థితి విషమించడంతో ఆమెను వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. తరువాత ఆమె ప్రైవేట్ భాగాల నుండి అధిక రక్తస్రావం, తీవ్రమైన కడుపు నొప్పి కారణంగా ఆమెను ఆగ్రాలోని ఉన్నత వైద్య కేంద్రానికి రెఫర్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడు తనకు చాక్లెట్‌ ఆశతో రప్పించి తనతో పాటు తీసుకెళ్లాడని బాలిక తన తండ్రికి చెప్పింది. ఆమె తండ్రి, రైతు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. గుర్తు తెలియని వ్యక్తిపై ఐపీసీ సెక్షన్లు 363 (కిడ్నాప్), 376AB (12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికపై అత్యాచారం), పొక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అలోక్ సింగ్ మాట్లాడుతూ.. ''అమ్మాయికి వైద్య పరీక్షలలో అత్యాచారం జరిగినట్లు నిర్ధారించబడింది. నిందితులను గుర్తించేందుకు మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు'' అని చెప్పారు.

Next Story