హిజ్రాపై అత్యాచారం.. 8 మంది అరెస్ట్‌

Eight men arrested molested hijra in Pulivendula.వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో దారుణం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 July 2022 8:29 AM IST
హిజ్రాపై అత్యాచారం.. 8 మంది అరెస్ట్‌

వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో దారుణం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు ఓ హిజ్రా పై అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. 50 ఏళ్ల హిజ్రా త‌న‌పై 13 మంది అత్యాచారానికి పాల్ప‌డ్డారంటూ దిశ యాప్‌లో బుధ‌వారం ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పులివెందులకు చెందిన పి.చక్రధర్, పి.గురుప్రసాద్, కె.కుమార్, కె.చలపతి, ఎ.బాలగంగిరెడ్డి, ఎస్ బ్రహ్మయ్య, పి.జయచంద్రశేఖర్‌రెడ్డి, ఎం.హరికృష్ణారెడ్డి, చిన్న అలియాస్ తరుణ్, బాబావల్లి, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు సురేంద్ర, షాకీర్, సుభాష్ కలిసి ఓ పంచాయితీ విషయంలో రెండు వాహనాల్లో సత్యసాయి జిల్లాలోని రాగన్నగారిపల్లెకు వెళ్లారు.

అనంత‌రం తిరిగి వ‌స్తూ క‌దిరి ర‌హ‌దారిలోని గంగ‌మ్మ గుడి వ‌ద్ద‌కు చేరుకున్నారు. అక్క‌డ ఉన్న ఇద్ద‌రు హిజ్రాల‌లో ఒక‌రిపై అత్యాచారానికి పాల్ప‌డ్డారు. బాధిత హిజ్రా ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కదిరి ఆంజనేయ స్వామి గుడి సమీపంలో 8 మంది నిందితులను అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. మ‌రో ఐదుగురి కోసం గాలిస్తున్న‌ట్లు చెప్పారు.

Next Story