ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఎనిమిది మంది మృతి

Eight killed after jeep and truck collide in Chintamani.క‌ర్ణాట‌క రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. జీపును లారీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Sep 2021 6:38 AM GMT
ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఎనిమిది మంది మృతి

క‌ర్ణాట‌క రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. జీపును లారీ ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్ర‌మాదం ఆదివారం రాత్రి చిక్‌బ‌ల్లాపూర్‌లో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే.. దిన‌స‌రి కూలీల‌తో వెలుతున్న జీపు చింతామ‌ణి స‌మీపంలోని మ‌ర‌నాయ‌క‌హ‌ళ్లి వ‌ద్దకు రాగానే బెంగుళూరు నుంచి నెల్లూరుకు వెళుతున్న లారీ ఢీ కొట్టింది.

ఈ ప్ర‌మాదంలో జీపులో ప్ర‌యాణిస్తున్న వారిలో ఎనిమిది మంది అక్క‌డిక్క‌డే మృత్యువాత ప‌డగా.. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను ప‌రిశీలించిన అనంత‌రం పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుల్లో ఇద్ద‌రు మ‌హిళ‌లు కూడా ఉన్నార‌న్నారు. కూలీలంతా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన వార‌ని పోలీసులు తెలిపారు.

Next Story
Share it