తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీం హైదరాబాద్‌లోని జీడిమెట్లలో భారీగా డ్రగ్స్ పట్టుకుంది. 220 కిలోల ఎఫెడ్రిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 72 కోట్లు, మన దేశంలో దాదాపు 10 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ డ్రగ్స్‌హైదరాబాద్‌లోని ప్రముఖ రసాయన పరిశ్రమలలో తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎఫెడ్రిన్ తయారీకి బిగ్ స్కేల్ కెమికల్ యూనిట్ వినియోగంచినట్లు గుర్తించారు. డ్రగ్ తయారీలో ప్రధాన నిందితుడు శివ రామకృష్ణగా గుర్తించారు. పోలీసులు డ్రగ్ తయారీకి వాడిన ఫార్ములా సైతం స్వాధీనం చేసుకున్నారు .
ఇదిలావుటే.. సెప్టెంబర్ 5న చర్లపల్లి ఇండస్ట్రియల్ కారిడార్ లోకెమికల్ ఫ్యాక్టరీ కేంద్రంగా ఎండీ (మె ఫెడ్రోన్) అనే మాదకద్రవ్యాలను ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించిన ఈగల్ టీం.. సుమారు రూ.12 వేల కోట్ల విలువైన నిషేధిత డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత తాజాగా ఈ రోజు పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.