Bhupalapally: దారుణం.. మద్యం మత్తులో భార్య, కుమార్తెని చంపేశాడు

ఓ వ్యక్తి మద్యం మత్తులో ఓ వ్యక్తి తన భార్య, కుమార్తెను హత్య చేశాడు. ఈ ఘటన తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది.

By అంజి  Published on  30 March 2023 4:44 PM IST
Jayashankar Bhupalapally , Crime news

Bhupalapally: దారుణం.. మద్యం మత్తులో భార్య, కుమార్తెను చంపేశాడు

మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. కొందరు క్షణికావేశంలో దారుణాలకు తెగబడుతున్నారు. కొంతమంది అయితే మద్యం మత్తులో సొంత వాళ్ల ప్రాణాలనే హరిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి మద్యం మత్తులో ఓ వ్యక్తి తన భార్య, కుమార్తెను హత్య చేశాడు. ఈ ఘటన తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. నిందితుడు గొడవ పడి తన భార్య, కుమార్తెను గొడ్డలితో నరికి చంపాడు. మృతులను ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం (12వ తరగతి) చదువుతున్న చందన (17), భార్య రమ (43) గా గుర్తించారు.

మద్యం మత్తులో ఇంటికి తిరిగి వచ్చిన నిందితుడు రమణాచారి.. మద్యం కొనుగోలుకు డబ్బులు ఇవ్వాలని భార్యను డిమాండ్ చేశాడు. ఆమె నిరాకరించడంతో ఆమెతో గొడవకు దిగాడు. తీవ్ర వాగ్వాదం జరగడంతో ఆ వ్యక్తి గొడ్డలిని తీసుకుని రామపై దాడి చేశాడు. తల్లిని కాపాడేందుకు చందన రావడంతో ఆమెపై కూడా దాడి చేశాడు. భయంతో ఇదంతా చూస్తున్న రమణాచారి తొమ్మిదేళ్ల కొడుకు కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని బాలుడిని కాపాడారు. వారు రమణాచారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం భూపాలపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Next Story