మద్యం మత్తులో ఆరు వాహనాలను ఢీకొట్టిన న‌టుడి డ్రైవర్.. నలుగురికి గాయాలు

జాతీయ అవార్డు గ్రహీత, నటుడు బాబీ సింహా కారు ప్రమాదానికి గురైంది.

By Medi Samrat
Published on : 19 April 2025 5:43 PM IST

మద్యం మత్తులో ఆరు వాహనాలను ఢీకొట్టిన న‌టుడి డ్రైవర్.. నలుగురికి గాయాలు

జాతీయ అవార్డు గ్రహీత, నటుడు బాబీ సింహా కారు ప్రమాదానికి గురైంది. అతని డ్రైవర్ మద్యం మత్తులో ఆరు వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మద్యం తాగి వాహనం నడపడం, అతి వేగంగా వాహనం నడపడం వంటి నేరాల కింద డ్రైవర్‌ను అరెస్టు చేశారు. శనివారం నాడు కారు ఎక్కడుతంగల్ నుండి చెన్నై విమానాశ్రయానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో నటుడు బాబీ సింహా కారులో లేడని పోలీసులు తెలిపారు.

ఉద‌యం ఎక్క‌డుతంగ‌ల్‌-చెన్నై విమానాశ్ర‌యం రోడ్డులో కారు ఇతర వాహ‌నాల‌పైకి దూసుకెళ్ల‌డంతో ప‌లువురికి గాయాల‌య్యాయి. ఈ ఘటనలో ఆరు వాహ‌నాలు ధ్వంసం అయ్యాయి. డ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స కోసం ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

Next Story