బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు తీవ్ర ఇబ్బంది కలిగించే విధంగా, జనతాదళ్ (యునైటెడ్) నాయకుడు జై ప్రకాష్ ప్రసాద్ అలియాస్ కాలు.. నలంద జిల్లాలో మద్యం తాగి నగ్నంగా తిరుగుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో జేడీయూ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. నలందలోని ఇస్లాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగదీష్‌పూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. రాత్రి ఫుల్‌గా మద్యం సేవించిన ప్రసాద్.. రోడ్డుపై నగ్నం తిరుగుతూ కనిపించాడు. ఇస్లాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార పార్టీ యువజన విభాగం ఇంచార్జిగా జై ప్రకాష్ ప్రసాద్ ఉన్నారు. జెడి(యు) ఇస్లామాపూర్ బ్లాక్ ప్రెసిడెంట్ తన్వీర్ ఆలం మాట్లాడుతూ.. ప్రసాద్‌కు రాజకీయంగా చాలా కాలంగా అనుభవం ఉందన్నారు. "సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో మేము స్థానిక పోలీసులకు సమాచారం అందించాము" అని ఆలం చెప్పారు.
ప్రసాద్ తన బట్టలన్నీ తీసేసి రోడ్డుపై వెళ్తున్నట్లు వీడియోలో కనిపించింది. అతని సోదరుడు ఇంటికి తిరిగి రావాలని అతనిని ఒప్పించడం కనిపించింది, కానీ అతను నిరాకరించాడు. అతనిని దుర్భాషలాడాడు. కొంతమంది వీడియోలు తీసి ఇస్లాంపూర్ పోలీస్ స్టేషన్‌కు కూడా సమాచారం అందించారు. "జగదీష్‌పూర్ గ్రామంలో గొడవ సృష్టిస్తున్న వ్యక్తి గురించి మాకు సమాచారం అందింది. మేము అక్కడికి చేరుకుని, అతను పూర్తిగా నగ్నంగా, మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించాము. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అతడు మద్యం సేవించినట్లు తేలింది. మద్యపాన నిషేధ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. అతడిని అరెస్టు చేశారు'' అని ఇస్లాంపూర్ ఎస్‌హెచ్‌ఓ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు.