దారుణం..మద్యం మత్తులో భార్య గొంతు కోసి చంపిన కిరాతక భర్త
బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది.
By - Knakam Karthik |
దారుణం..మద్యం మత్తులో భార్య గొంతు కోసి చంపిన కిరాతక భర్త
బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ కిరాతక భర్త తన భార్యను కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. నగరంలోని మైకో (MICO) లేఅవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలేకహళ్లిలో ఈ ఘటన జరిగింది. దావణగెరె జిల్లాకు చెందిన నాగరాజు, రంగమ్మ (45) దంపతులు నాలుగేళ్ల క్రితం ఉపాధి కోసం బెంగళూరుకు వలస వచ్చారు. భార్య హౌస్‌కీపింగ్‌లో పనిచేస్తుండగా, భర్త సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.
వీరి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. నాగరాజు నిత్యం మద్యం తాగి భార్యతో గొడవ పడేవాడు. మార్చి 15 రాత్రి చిన్న విషయంలో తలెత్తిన వివాదం ముదిరి రంగమ్మపై కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడవగా, నిందితుడు పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నాగరాజును పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపడుతున్నారు.