హాస్టల్‌లో ఒంటరిగా ఉన్న ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినిపై కారు డ్రైవర్ అత్యాచారం

ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినిపై కారు డ్రైవర్ అత్యాచారానికి తెగబడ్డాడు.

By Medi Samrat  Published on  16 Jan 2025 7:25 PM IST
హాస్టల్‌లో ఒంటరిగా ఉన్న ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినిపై కారు డ్రైవర్ అత్యాచారం

ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినిపై కారు డ్రైవర్ అత్యాచారానికి తెగబడ్డాడు. ఆమె హాస్టల్ గదిలో అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జనవరి 15న జరిగినప్పటికీ ఆమె పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు చేసింది. దీంతో ఈ దారుణం గురువారం నాడు వెలుగులోకి వచ్చింది. సంక్రాంతి సందర్భంగా కళాశాలకు సెలవులు ప్రకటించడంతో బాలిక స్వగ్రామానికి వెళ్లింది.

కాలేజీలో సెమిస్టర్ పరీక్షకు హాజరయ్యేందుకు ఆమె తన హాస్టల్‌కు తిరిగి వచ్చింది. హాస్టల్‌లో బాలిక ఒంటరిగా ఉందని తెలుసుకున్న డ్రైవర్ ఆమె గదిలోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. నిందితుడు హాస్టల్‌కు సమీపంలో ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్‌ దగ్గర కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

Next Story