పొగమంచు కారణంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నైనిటాల్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ఉదయం 7:30 గంటల ప్రాంతంలో డజనుకు పైగా వాహనాలు ఢీకొన్నాయి. ఇందులో శ్రీ రామ్ మూర్తి మెమోరియల్ మెడికల్ కాలేజీ బస్సు కూడా ఉంది. ఈ ప్రమాదంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ కూడా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో 12 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
నైనిటాల్ హైవేపై జాదోపూర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో ఓ లారీ, కొన్ని వాహనాలు బోల్తా పడ్డాయి. పొడవాటి క్యూలో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. గాయపడిన వారందరినీ శ్రీరామ్‌మూర్తి మెమోరియల్ మెడికల్ కాలేజీలో చేర్పించారు. క్షతగాత్రుల బంధువులను సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.