వైద్యుడు ఆత్మహత్య.. సూసైడ్‌ నోట్‌లో కాంగ్రెస్‌ నేత పేరు

కర్నాటకలోని గడగ్ జిల్లాలో ఓ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో స్థానిక కాంగ్రెస్ నాయకుడిపై ఆరోపణలు ఉన్నాయని అధికారులు మంగళవారం తెలిపారు.

By అంజి
Published on : 13 Feb 2024 1:45 PM IST

Doctor, Karnataka, suicide, Congress leader, Crime news

వైద్యుడు ఆత్మహత్య.. సూసైడ్‌ నోట్‌లో కాంగ్రెస్‌ నేత పేరు

కర్నాటకలోని గడగ్ జిల్లాలో ఓ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో స్థానిక కాంగ్రెస్ నాయకుడిపై ఆరోపణలు ఉన్నాయని అధికారులు మంగళవారం తెలిపారు. విచారణ చేపట్టిన రోణ పోలీసులు నిందితుడు, బాధితుడు ఇద్దరూ అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. మృతుడు జిల్లాలోని రోనా తాలూకాలోని హిరేహల్ గ్రామానికి చెందిన డాక్టర్ షహషిధర్ హట్టిగా గుర్తించారు. కాంగ్రెస్ కార్యకర్త అయిన హట్టి సోమవారం రాత్రి తన నివాసంలో ఉరివేసుకుని చనిపోయాడు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు శరణగౌడ్ పాటిల్ పేరును ప్రస్తావిస్తూ, తన మరణానికి అతనే కారణమంటూ సూసైడ్ నోట్ రాశాడు.

ప్రతిరోజూ అన్ని గణాంకాలు, లెక్కలు సమర్పించినప్పటికీ, తనకు మరింత డబ్బు చెల్లించాలని పాటిల్ ఒత్తిడి చేస్తున్నాడని డెత్ నోట్‌లో బాధితుడు పేర్కొన్నాడు. ఈ నేప‌థ్యంలో త‌న జీవితాన్ని ముగించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు బాధితుడు పేర్కొన్నాడు. నిందితుడు శరణా గౌడ్ అత్యంత ప్రభావశీలి అని, అతడిని న్యాయశాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి హెచ్‌కే పాటిల్ ద్వారా కఠినంగా శిక్షించాలని ఆ నోట్‌లో బాధితుడు పేర్కొన్నాడు. బాధితుడు డెత్ నోట్‌లో పేర్కొన్న ఖాతాలు, చెల్లింపులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇసుక మాఫియా జోరుగా సాగుతున్నట్లు సమాచారం.

Next Story