అడవికి తీసుకెళ్లి మైనర్‌ బాలికపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్‌

Differently-abled minor girl raped in Madhya Pradesh. మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మానసిక వికలాంగురాలైన ఓ మైనర్‌ బాలికపై వ్యక్తి అత్యాచారం చేశాడు.

By అంజి  Published on  10 Aug 2022 1:52 PM IST
అడవికి తీసుకెళ్లి మైనర్‌ బాలికపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్‌

మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మానసిక వికలాంగురాలైన ఓ మైనర్‌ బాలికపై వ్యక్తి అత్యాచారం చేశాడు. బాధితురాలి బంధువులు గ్రామస్తుల సహకారంతో నిందితుడిని పట్టుకున్నారు. ఈ ఘటన షియోపూర్‌లోని కరాహల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. నిందితుడు రామ్‌కరణ్‌ జాతవ్‌ మాయమాటలు చెప్పి బాలికను గ్రామ సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే పొలం పనులకు వెళ్తున్న కొందరు రామ్‌కరణ్‌ దగ్గర బాలికను చూశారు. ఆ వెంటనే గ్రామస్తులు రామ్‌కరణ్‌ను వెంబడించి పట్టుకున్నారు.

ఆ తర్వాత గ్రామస్థులు నిందితుడు రాంకరన్ జాతవ్‌ను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ''మా ఇరుగుపొరుగున నివసించే కొందరు గ్రామస్తులు నా దగ్గరకు వచ్చి మీ సోదరిని రామ్‌కరన్ జాతవ్ తీసుకెళ్లాడని చెప్పారని, ఆపై మేము అతడిని వెంబడించి పట్టుకున్నామని చెప్పారని'' బాధితురాలు అక్క చెప్పింది. నిందితుడు రాంకరన్ జాతవ్‌ను గ్రామస్థులు తీవ్రంగా కొట్టి కరాహాల్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కరాహల్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ కీర్తి రాజవత్ తెలిపారు.

Next Story